లింగాల ఘణపురం : మండలంలోని కళ్లెంలో ఓ వ్యక్తి మృతిచెందగా అతనితో పదో తరగతి చదివిన స్నేహితులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. కళ్లెం గ్రామానికి చెందిన యాకూబ్ పాషా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 7న ఆయన గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య రేష్మ కూతురు అయేషా తబుసం కుమారుడు ఆశిష్ ఉన్నారు.
నిరుపేద కుటుంబానికి చెందిన యాకూబ్ పాషాకు2002 -2003 సంవత్సరంలో పదో తరగతి పూర్వ విద్యార్థులు కళ్లెం, సిరిపురం, మాణిక్యపురం, జీడికల్, రామచంద్ర గూడెంకు చెందిన స్నేహితులు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 50 వేల రూపాయలు జమ చేసి అయేషా తబుసం పేరా పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన పథకంలో డిపాజిట్ చేశారు. ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు.