T20 World Cup 2024 : లీగ్ దశ నుంచి ఉత్కంఠ పోరాటాలతో అలరిస్తున్న పొట్టి ప్రపంచకప్(T20 World Cup) ఆఖరి దశకు చేరుకుంది. విండీస్ గడ్డపై సెమీఫైనల్ ఫైట్ రేపటితో షరూ కానుంది. లీగ్ దశలో, సూపర్ 8లో పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వరుణుడు(Rain) మళ్లీ ఆటకు అడ్డుపడే చాన్స్ ఉంది. ఒకవేళ వర్షం పడితే గనుక అంతా తలకిందులవ్వడం ఖాయం.
గ్రూప్ 1 నుంచి భారత్ (India), అఫ్గనిస్థాన్‌లు ఫైనల్ బెర్తుపై కన్నేయగా.. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా (South Africa)లు టైటిల్ పోరుకు వెళ్లాలనే పట్టుదలతో ఉన్నాయి. ట్రినిడాడ్‌లో జూన్ 27 ఉదయం సఫారీలతో అఫ్గనిస్థాన్ తలపడనుండగా.. గయానా వేదికగా రాత్రి 8 గంటలకు డిఫెండింగ్ చాంపియన్‌ను టీమిండియా ఢీ కొట్టనుంది. అయితే.. ఈ రెండు మ్యాచ్‌లకు వాన ముప్పు ఉందని సమాచారం. దాంతో, నాలుగు జట్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
A mouth-watering contest 🇿🇦 🇦🇫
Who will make their first ever men’s #T20WorldCup final? 🤔 pic.twitter.com/23tXWhZfse
— ICC (@ICC) June 26, 2024
తొలి సెమీస్‌కు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్ డే (Reserve Day)ను కేటాయించింది. ఒకవేళ వర్షం కారణంగా ఆట సాగకుంటే మరునాడు అంటే 28వ తేదీ శుక్రవారం యథావిధిగా ఆడిస్తారు. ఆ రోజు కూడా మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడితే అదనంగా 3 గంటల సమయం ఇస్తారు. అయినా ఔట్‌ఫీల్డ్ తడిగా ఉంటే మ్యాచ్ జరపడం కష్టమని రిఫరీలు భావిస్తే.. అది దక్షిణాఫ్రికాకు కలిసొస్తుంది. గ్రూప్ దశ నుంచి సూపర్ 8 వరకూ ఓటమమెరుగకుండా అగ్రస్థానంలో ఉన్న సఫారీలు ఫైనల్లో అడుగుపెడుతారు.
మరోవైపు .. రెండో సెమీస్ అయిన భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. అందువల్ల వాన కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే అదనంగా 250 నిమిషాల సమయం కేటాయిస్తారంతే. అప్పటికీ వాన తగ్గినా ఔట్‌ఫీల్డ్ అనువగా లేకుంటే గ్రూప్ దశలో టాప్‌లో ఉన్న టీమిండియా నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లే అవకాశముంది. అదే జరిగితే వరుసగా రెండోసారి ట్రోఫీని ఒడిసిపట్టాలనుకున్న బట్లర్ సేన ఉసూరుమంటూ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
St. Lucia ✅#TeamIndia have reached Guyana ✈️ for the Semi-final clash against England! 👍 👍#T20WorldCup | #INDvENG pic.twitter.com/p4wqfZ4XUw
— BCCI (@BCCI) June 26, 2024