Ollie Robinson : క్రికెట్లో పవర్ హిట్టర్ల విధ్వంసానికి బౌలర్లు బలవ్వడం కొత్తేమీ కాదు. విధ్వంసక ఆటగాళ్ల ధాటికి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. 30కి పైగా పరుగులు సమర్పించుకున్న వాళ్లూ ఉన్నారు. తాజాగా ఇంగ్లండ్ స్టార్ బౌలర్ ఓలీ రాబిన్సన్ (Ollie Robinson) సైతం పట్టపగలే చుక్కలు చూశాడు.
సొంతగడ్డపై జరిగిన కౌంటీ మ్యాచ్‌లో బ్యాటర్ల ఊచకోతకు రాబిన్సస్.. ఒకే ఓవర్లో 43 పరుగులు సమర్పించుకున్నాడు. సస్సెక్స్ జట్టుకు ఆడుతున్న ఈ పేసర్ జూన్ 25 బుధవారం జరిగిన మ్యాచ్‌లో బలిపశువు అయ్యాడు.
43 runs is the record for the most runs off an over in County Championship’s 134 year history https://t.co/MMHTRMA9F2
— Vitality County Championship (@CountyChamp) June 26, 2024
రాబిన్సన్ బౌలింగ్‌లో లీసెస్టర్‌షైర్ బ్యాటర్ లూయిస్ కింబర్ (Louis Kimber) 37 రన్స్ కొట్టగా.. మిగతా ఆరు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. రాబిన్సన్ ఆ ఓవర్లో 9 బంతులు వేయగా.. కింబర్ ఏకంగా ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేశాడు. దాంతో, ఈ స్పీడ్‌స్టర్ బిక్కమొహం వేశాడు.
మరో కౌంటీ మ్యాచ్‌లో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir) సైతం 38 పరుగులు ఇచ్చాడు. భారత పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బషీర్ అద్భుతంగా రాణించాడు. దాంతో, ఇంగ్లండ్ జట్టులో స్థానాన్ని పదిలపరుచుకుంటాడనుకున్న వేళ బషీర్.. ఈ స్థాయిలో పరుగులివ్వడం ఆ దేశ క్రికెట్ బోర్డును కలవరపరుస్తోంది.