Dasyam Vinay Bhaskar | హనుమకొండ చౌరస్తా, జనవరి 10 : ‘ఒక్కరి కోసం అందరు.. అందరి కోసం ఒక్కరు’ అనే లక్ష్యంతో సమిష్టిగా కలిసి మీ పాఠశాలల ఆర్థికాభివృద్ధికి సంఘం ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ కాపువాడలోని ప్రదీప్ హైస్కూల్లో హనుమకొండ జిల్లా అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ (హడుప్సా) మ్యూచవల్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. అధ్యక్షుడు వర్ధమాన్ జనార్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా వినయ్‌భాస్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. పొదుపు సంఘాలు బతుకుదెరువు కోసం కాదు బతికించడానికి ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా మిగితా రంగాలలోని ప్రజలు కూడా పొదుపు సంఘం ద్వారా పొందే లాభాలు మీ ద్వారా తెలుసుకొని అనేక సంఘాలు ఏర్పాటు కావడానికి మీరు స్పూర్తిదాయకంగా.. క్రమశిక్షణగల సంఘంగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని సంఘసభ్యులందరికి ఆయన అభినందనలు తెలిపారు.
అధ్యక్షుడు వర్ధమాన్ జనార్దన్ మాట్లాడుతూ.. వినయ్‌భాస్కర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1,2023న 23 మంది సభ్యులతో ప్రారంభించి సహకార చట్టం తెలంగాణ ప్రకారం రిజిస్టర్ చేసి సభ్యుల సంఖ్యను పెంచుతూ నేటికి 71 మందితో కొనసాగించడం జరుగుతుందన్నారు. సభ్యుడు మరణించినట్లయితే వారి కుటుంబానికి రూ.50 వేలు బీమా సదుపాయం కింద అందిస్తూ ప్రతీ మాసం కనీసం నలుగురు సభ్యులకు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి నేనెళ్ళ రవీందర్‌రెడ్డి, కోశాధికారి పీ సతీష్‌కుమార్, డైరెక్టర్స్ సంతోష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కే శ్రీధర్, టీ రాజేశ్వర్‌రావు,
టీ బుచ్చిబాబు, వైవీ రావు, సభ్యులు పాల్గొన్నారు.