Junior Virat Kohli : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే సిరీస్ కోసం నెట్స్‌లో గట్టిగానే శ్రమించాడు. వడోదరలో న్యూజిలాండ్‌తో ఆదివారం తొలి మ్యాచ్ ఉన్నందున బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. సహచరులకు సూచనలిస్తూ సందడిగా గడిపాడు విరాట్. ఈ సందర్భంగా కోహ్లీ తనలానే ఉన్న చిన్న పిల్లగాడిని చూసి షాకయ్యాడు. ఆ చిన్నారిని చూశాక తన చిన్నప్పటి ఫొటోలను గర్తు చేసుకున్నాడీ మాజీ కెప్టెన్. ఆ తర్వాత అతడికి నవ్వతూ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు కోహ్లీ.
ఆదివారం తొలి వన్డే కోసం స్క్వాడ్‌తో కలిసి వడోదర చేరుకున్న కోహ్లీ.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్‌తో చెమటోడ్చాడు. అంతుకుముందు విరాట్ మైదానంలోకి వెళ్తుండగా అచ్చం అతడిలానే ఉన్న ఒక పిల్లాడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆ బాబుకు మురిపెంగా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు కోహ్లీ. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌ను పోలిన ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
𝐃𝐞𝐣𝐚 𝐂𝐡𝐞𝐞𝐤𝐮 ❤️🥹#ViratKohli pic.twitter.com/hNhNsBcqSb
— Punjab Kings (@PunjabKingsIPL) January 10, 2026
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా చెలరేగి ఆడుతున్న విరాట్ కోహ్లీ న్యూజిలాండ్పైనే దంచేందుకు సిద్ధమయ్యాడు. నిరుడు స్వదేశంలో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు శతకాలతో కదం తొక్కిన విరాట్.. ఇప్పుడు కివీస్ బౌలర్ల భరతం పట్టనున్నాడు. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించి చేస్తూ అందర్నీ నవ్వించాడు కోహ్లీ.
Even the King can’t resist 😂❤️
📹 Courtesy: SportsTiger#ViratKohli #ArshdeepSingh pic.twitter.com/RwdKVqR6u1
— Punjab Kings (@PunjabKingsIPL) January 9, 2026