MLA Jagadish Reddy : బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు శిగ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండర్ను మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి (MLA Jagadish Reddy) ఆవిష్కరించారు. హైదరాబాద్లోని నివాసంలో జగదీశ్వర్ రెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సమక్షంలో క్యాలెండర్ను విడుదల చేశారు.
నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్, ఉస్మానియా బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు మిథున్ ప్రసాద్, నెమ్మాది శ్రావణ్ కుమార్, అవినాష్, నిజాం కళాశాల బీఆర్ఎస్వీ అధ్యక్షులు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.