World Cup Celebration : భారత క్రికెట్లో కొత్త శకానికి నాంది పలికిన 1983 వరల్డ్ కప్ విజయాన్ని మరచిపోగలమా. టీమిండియా సత్తాను ప్రపంచమంతా చాటిన కపిల్ దేవ్ (Kapil Dev) సేన ట్రోఫీ అందుకొని 41 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అప్పటి జట్టులోని సభ్యులంతా కేకు కోసి ఆ అపూర్వ విజయాన్ని గుర్తు చేసుకున్నారు.
టీ20 వరల్డ్ కప్ కామెంటరీ ప్యానెల్లో భాగమైన భారత దిగ్గజాలు రవి శాస్త్రి (Ravi Shastri), సునీల్ గవాస్కర్, బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నిలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ తరం క్రికెటర్లు రిషభ్ పంత్, సిరాజ్‌లు సైతం ఈ లెజెండ్స్‌తో సందడి చేశారు. భారత క్రికెట్ గతిని మార్చిన తొలి ఐసీసీ ట్రోఫీ గెలిచిన రోజును తలచుకొని అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం అంతా ఫొటోలకు పోజిచ్చారు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Time flies. A Day that changed the FACE of Indian Cricket forever. Old is Gold. 41 years 🙏🙏🙏 – #TDTY #WorldChampions @cricketworldcup @ICC @BCCI pic.twitter.com/gP2UqLFlmL
— Ravi Shastri (@RaviShastriOfc) June 26, 2024
ప్రపంచ క్రికెట్లో భారత జట్టు పేరు పెద్దగా వినిపించి రోజు జూన్ 25. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 1983 వరల్డ్ కప్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా సంచలనం సృష్టించింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో 162 పరుగుల తేడాతో ఓడి నిరాశపరిచినా.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొంది. సమిష్టిగా రాణిస్తూ విజయబావుతా ఎగురవేసింది. సెమీఫైనల్లో జింబాబ్వేపై కెప్టెన్ కపిల్ దేవ్ 175 చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఫైనల్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై మహీందర్ అమర్నాథ్(26, 3/12) ఆల్‌రౌండ్ షోతో చెలరేగాడు. దాంతో, 43 పరుగుల తేడాతో గెలుపొంది తొలిసారి ఐసీసీ ట్రోఫీని దేశానికి అందించింది.
