IPL 2025 : క్రికెట్ అభిమానులకు ‘డకౌట్'(Duck Out) అనే పదం సుపరిచితమే. క్రీజులోకి వచ్చిన బ్యాటర్ ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ అయితే అతడు /ఆమె డకౌట్ అయ్యారని అంటాం. మనందరికీ తెలిసిన డకౌట్లో గోల్డెన్ డక్ (Golden Duck) చాలా పాపులర్. గోల్డెన్ డక్. దీనర్థం.. ఎదుర్కొన్న మొదటి బంతికే వెనుదిరగడం. ఇందులోనే సిల్వర్ డక్, డైమండ్ డక్, రాయల్/ ప్లాటినమ్‌తో పాటు ఇంకొన్ని రకాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా.
డైమండ్ డక్ అంటే.. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరడం. అంటే.. నాన్ స్ట్రయికర్‌గా ఉండగానే, బౌలర్ బంతిని విసరకముందే వికెట్ కోల్పోవడం. లేదా స్టంపౌట్ కావడం. ఒకవేళ క్రీజులోకి 3 నిమిషాల తర్వాత వచ్చినా వాళ్లను రనౌట్‌గా ప్రకటించే అవకాశముంది. ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటన్స్ హిట్టర్ రాహుల్ తెవాటియా(Rahul Tewatia) డైమండ్ డక్ అయ్యాడు.
Pinpoint accuracy 🎯
Chaos in the middle and Hardik Pandya capitalizes with a direct hit to run Rahut Tewatia out!
Updates ▶ https://t.co/lDF4SwnuVR #TATAIPL | #GTvMI | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/PM4YQy46y4
— IndianPremierLeague (@IPL) March 29, 2025
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షెఫ్రానే రూథర్‌ఫర్డ్ ఆడిన బంతికి పరుగు తీయబోగా.. హార్దిక్ పాండ్యా విసిరిన త్రోకు రనౌట్‌గా డగౌట్‌కు వెళ్లాడు తెవాటియా. క్రికెట్ చరిత్రలో డైమండ్ డక్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడి పేరు .. జోయెల్ గార్నర్. 1980లో ఈ వెస్టిండీస్ పేసర్ ఇంగ్లండ్‌పై ఈ తరహాలో ఔటయ్యాడు.
సిల్వర్ డక్ – ఇన్నింగ్స్‌లో రెండు బంతులు ఎదుర్కొని.. ఒక్క రన్ కూడా చేయకుండా ఔట్ అవుతారు కొందరు. అప్పుడు వాళ్లు సిల్వర్ డక్ అయ్యారని కామెంటేటర్లు చెబుతారు.
బ్రాంజ్ డక్ – ఒక ఇన్నింగ్స్‌లో మూడు బంతులు ఆడి.. పరుగుల ఖాతా తెరకుండానే పెవిలియన్ చేరడం.
రాయల్ / ప్లాటినమ్ డక్ – ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ అయితే.. సదరు బ్యాటర్ రాయల్ లేదా ప్లాటినమ్ డక్ అయినట్టు పరిగణిస్తారు. ఓపెనర్లు మాత్రమే ఈ రాయల్ డక్ అయ్యే అవకాశముంది. \
లాఫింగ్ డక్ – క్రీజులోకి వచ్చి చాలా సేపు అయినా కొందరు సున్నాకే వెనుదిరుగుతారు.20కి పైగా బంతులు ఆడి జీరోకే ఔట్ అయ్యేవాళ్లు లాఫింగ్ డక్ అయినట్టు లెక్క.
పెయిర్ – ఇది టెస్టు క్రికెట్‌కు సంబంధించినది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే ఔట్ అయ్యే బ్యాటర్లను పెయిర్ డక్ అయినట్టు చెబుతారు.
కింగ్ పెయిర్ – ఇది కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు సంబంధించినదే. దీని ప్రకారం మొదటి, రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అవ్వడం.