Padma Devender Reddy | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 31 : రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని బీఆర్ఎస్ జిల్లా ఆధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మెదక్ పట్టణంలోని గాంధీనగర్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో వారు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు నెల రోజులపాటు ఎంతో నిబద్ధతతో ఉపవాసాలు ఉండటం ద్వారా సమాజంపై ప్రేమ, గౌరవం కలుగుతాయన్నారు. ఈ మాసంలో ధానధర్మాలకు ప్రత్యేకత ఉందన్నారు. అన్ని మతాల ప్రజలు స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, మాజీ కౌన్సిలర్లు ఆంజనేయులు, కృష్ణారెడ్డి, గడ్డమీది కృష్ణాగౌడ్, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు జుబేర్, ఫాజిల్, మహమ్మద్, మధు, మోహన్, నాగేందర్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారిని మత పెద్దలు సత్కరించారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం