భూత్పూర్ : మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ బీఆర్ఎస్ (BRS) మండలనాయకుడు ఆల శ్రీకాంత్ రెడ్డి ( Ala Srikanth Reddy) జన్మదిన వేడుకలను ( Birthday Celebrations ) బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్ గౌడ్ ఇంట్లో భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.
అంతకుముందు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ, కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. కట్ చేసిన కేక్ ను పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు యాదిరెడ్డి, ఆంజనేయులు,వెంకటయ్య, సాబీర్,సత్యం తదితరులు పాల్గొన్నారు.