Nagarjuna | కింగ్ నాగార్జున.. ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడే. 65 ఏళ్ల వయస్సు వచ్చిన కూడా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. ఫ్యామిలీ కంటెంట్ తో ప్రేక్షకులకు ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్న నాగార్జున పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూ గత 5 సీజన్లుగా అలరిస్తూ ఉన్నారు. అయితే ప్రతి సీజన్లోను నాగార్జున డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటూ ఉంటారు. వయస్సు పెరుగుతున్న కొద్ది ఆయన మరింత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. 65 ఏళ్లు దాటిన యంగ్ లుక్కు తోనే నాగర్జున అట్రాక్ట్ చేస్తుండడం విశేషం.
ఆరు పదుల వయసు దాటినా నాగార్జున ఇంకా యవ్వనంగా ఎలా కనిపిస్తున్నారు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూ ఉంటుంది. తోటి నటీనటులంతా ఓల్డ్ గా మారిపోతుంటే నాగార్జున మాత్రం యంగ్ లుక్‌లో కనిపిస్తూ తన కుమారులకే గట్టి పోటీ ఇస్తున్నారు. కొడుకు చైతన్యతో, అఖిల్‌తో పోటీపడేలా స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తూ అందరిని సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తూ ఉంటారు. అసలు ఇది ఎలా సాధ్యం అని నాగార్జునకి చాలా ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ సమయంలో తన ఫిట్నెస్ సీక్రెట్‌ని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
30వ ఏట నుంచే నాగార్జున ఒక స్పెషల్ డైట్ ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. ప్రతిరోజు ఉదయం లైట్ ఫుడ్స్ తీసుకొని, మధ్యాహ్నం ఒక మోతాదులో భోజనం చేస్తారట. రాత్రికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 7:30 లోపు డిన్నర్ పూర్తి చేస్తారట. అంతేకాదు నాగార్జున 12 గంటలు ఫుడ్ తీసుకుంటే, మిగిలిన 12 గంటలు ఫాస్టింగ్ లో ఉంటారంట. ఇక తన బాడీకి తగిన విధంగా ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ తగిన మోతాదులో అందేలా చూసుకుంటారంట.ఇక అతను తీసుకునే ఫుడ్ ఖరీదు ఒక్క రోజుకి గాను పది వేల వరకు ఉంటుందట. అంటే నెలకి మూడు లక్షల వరకు స్పెషల్ డైట్ కోసమే నాగ్ ఖర్చు చేస్తారట. స్ట్రిక్ట్ డైట్ ను మైంటైన్ చేయడంతో పాటు ప్రతిరోజు కచ్చితంగా గంట పాటు క్వాలిటీ వర్కౌట్ చేస్తారంట. ఇలా గత కొన్నేళ్లుగా నాగ్ స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు కాబట్టే ఆయన అంత యంగ్‌గా కనిపిస్తున్నారు