IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(51) అర్ధ శతకంతో రాణించాడు. ఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు స్వింగ్‌తో, బౌన్సర్లతో సవాల్ విసిరుతూ వికెట్లు తీస్తున్నా.. క్రీజులో పాతుకుపోయిన రాహుల్ స్పిన్నర్ బషీర్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు. 97 బంతుల్లో 5 ఫోర్లతో అతడు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. పక్కా ప్లాన్‌తో శుభ్‌మన్ గిల్(16) వికెట్ రాబట్టిన ఇంగ్లండ్‌కు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (18) తనదైన స్టయిల్లో ఆడతూ తలనొప్పిగా మారాడు. ఈ జోడీ ఇప్పటికే నాలుగో వికెట్‌కు 30 రన్స్ చేసింది. ప్రస్తుతానికి టీమిండియా స్కోర్ .. 137/3. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 249 రన్స్ వెనకబడి ఉంది.
భారత ఇన్నింగ్స్ ఆరంభించిన కాసేపటికే జోఫ్రా ఆర్చర్ తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీ జైస్వాల్(13)ని ఔట్ చేశాడు. యశస్వీ ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ ఒడుపుగా అందుకున్నాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్(40), కేఎల్ రాహుల్‌లు కీలక భాగస్వామ్యంలో వికెట్ పడకుండా చూసుకున్నారు.
Fifty for KL Rahul – his 19th in Tests! 👍
A solid knock from the #TeamIndia opener! 💪
Updates ▶️ https://t.co/X4xIDiSmBg #ENGvIND | @klrahul pic.twitter.com/Z1Tkn3GMwG
— BCCI (@BCCI) July 11, 2025
టీ బ్రేక్ తర్వాత స్టోక్స్ బౌలింగ్‌లో నాయర్ కట్ చేసిన బంతిని జో రూట్ డైవింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. ఫస్ట్ స్లిప్‌లో కాచుకొని ఉన్న ఇంగ్లండ్ స్టార్ రెప్పపాటులో ఎడమవైపు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. నాయర్ పెవిలియన్ చేరడంతో 74 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(16) జతగా ఇన్నింగ్స్ నిర్మించాడు రాహుల్. అయితే.. ఈ ద్వయాన్ని విడదీసేందుకు క్రిస్ వోక్స్ పన్నిన వ్యూహంలో గిల్ చిక్కుకున్నాడు.