Bonalu in London : ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ అసోసియేన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. యూకే దేశంలోని నలు మూలల నుంచి సుమారు 2,000లకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు ఈ బోనాల మహోత్సవానికి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు నాయకత్వంలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, కమ్యూనిటీ ఆఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యాఖ్యతలుగా వ్యవహరించారు.
పార్లమెంట్ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (మైగ్రేషన్ అండ్ సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లా నగర మేయర్ అమీ క్రాప్ట్ ముఖ్య అతిథులుగా.. కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి, ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సెలర్ ప్రభాకర్ ఖాజా, అమమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్ బంధన చోప్రా అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులుగా.. తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
బోనాల వేడుకను స్వదేశంలో మాదిరిగానే సాంప్రదాయ బద్ధంగా జరిపారు. పూజలు నిర్వహించడంతో పాటు తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సమేతంగా, అందరూ కలిసి ఇలా వేడుకలు చేసుకోవడం ద్వారా.. మన పండుగల విశిష్టతను రాబోయే తరాలకు చాటి చెప్పవచ్చని అతిథులు అన్నారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను సంస్కృతులను ఆదరించే గొప్ప దేశమని, మనమంతా కలిసి మెలిసి ఐకమత్యంతో ఉండాలని బోనాలకు హాజరైన ముఖ్య అతిథులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా టాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. అందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడమే కారణమని ఆయన స్పష్టం చేశారు. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన తొలి సీఎం కేసీఆర్‌ను మనం ఎల్లవేళలా కొలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బోనాల వేడుక ఏర్పాట్లు ఎంతో గొప్పగా ఉన్నాయని నిర్వాహకులను కూర్మాచలం అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవోపేతంగా తెలంగాణలో నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. బోనాల పండగ ప్రాధాన్యతల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్ జెల్ల, నాగ్, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతి, క్రాంతి, శ్వేత, శ్రీవిద్య, నీలిమ, పృథ్వీ, మనితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవరెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా తదితరులు పాల్గొన్నారు.