అబిడ్స్, ఫిబ్రవరి 25: మంగళ్‌హాట్ పోలీస్ స్టేష న్ పరిధిలోని అరాంఘర్ కాలనీలో ఓ ప్రైవేటు ఉద్యోగి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఆరాంఘర్ కాలనీలో వినాయక విగ్రహాల తయారీ కోసం ఏర్పాటు చేసిన షెడ్డులో బుధవారం తెల్లవారు జామున వడ్డీ వ్యాపారులైన కొందరు వ్యక్తులు మద్యం తాగి.. రస్పరం గొడవ పడ్డారు. షాహినాయత్‌గంజ్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి రిషబ్ అగర్వాల్(32) సైతం వారితో కలిసి మద్యం తాగగా, వీరి మధ్య గొడవ జరిగి మాటా మాటా పెరిగింది.
దీంతో రిషబ్ అగర్వాల్‌పై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో అతడడు అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళ్‌హాట్ జుమ్మెరాత్ బజార్‌కు చెందిన మున్నాసింగ్ (35)తో పాటు ప్రణయ్, ఓం ప్రకాశ్, ఉదయ్, కిరణ్, గోషామహల్ నివాసి లడ్డూ ఈ దాడికి పాల్పడ్డారు. వీరిలో లడ్డూ పరారీలో ఉండగా, మిగిలిన నలుగురు నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగి పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.