అమీర్‌పేట్, ఫిబ్రవరి 25 : ఓ వంట మనిషి దారుణ హత్య గురయ్యాడు. సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం….కర్ణాటక రాష్ర్టానికి చెందిన శంకర్ (55) భరత్‌నగర్‌లో ఉంటూ స్థానిక మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఓ ఉడిపి హోటల్లో హెడ్ కుక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం హోటల్‌కు వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆటకాయించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావంపై శంకర్ కుప్పకూలిపోయాడు.
స్థానికులు తక్షణమే 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా, చికిత్స అందిస్తుండగానే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, హత్య జరిగిన ప్రాంతంలో సరైన సీసీ కెమెరాలు లేవు. అదే అదునుగా భావించి నిందితుడు దాడి చేసి ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.