IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు రెండో వికెట్ పడింది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అర్ధ శతకానికి చేరువైన కరుణ్ నాయర్(40)ను వెనుదిరిగాడు. స్టోక్స్ బౌలింగ్‌లో నాయర్ కట్ చేసిన బంతిని జో రూట్ డైవింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. ఫస్ట్ స్లిప్‌లో కాచుకొని ఉన్న ఇంగ్లండ్ స్టార్ రెప్పపాటులో ఎడమవైపు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో, టెస్టుల్లో 211 క్యాచ్‌లతో భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) రికార్డును బ్రేక్ చేశాడు రూట్.
నాయర్ పెవిలియన్ చేరడంతో 74 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(21)కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(1) తోడయ్యాడు. ఇండియా స్కోర్.. 75/2. ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు వెనకబడి ఉంది.
Out on his own at the 𝐯𝐞𝐫𝐲 𝐭𝐨𝐩 🔝
What a way to go clear with the most catches in Test history 🥇 pic.twitter.com/zDMUdRFZcq
— England Cricket (@englandcricket) July 11, 2025
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కథ ముగించి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో మూడు ఫోర్లతో అదరగొట్టిన యశస్వీ జైస్వాల్ (13) మరుసటి ఓవర్లోనే ఔటయ్యాడు. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన జోఫ్రా ఆర్చర్ తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీని ఔట్ చేశాడు.
లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన ఆర్చర్.. మూడో బంతికి ఓపెనర్‌ను డిఫెన్స్‌కు సిద్ధం చేశాడు. కానీ, బంతి ఎడ్జ్ తీసుకోగా స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ ఒడుపుగా అందుకున్నాడు. అంతే.. ఆర్చర్ తనదైన స్టయిల్లో సంబురాలు చేసుకున్నాడు. ఆ తర్వాత వోక్స్, కార్సే, ఆర్చర్లను దీటుగా ఎదుర్కొంటూ కేఎల్ రాహుల్(21) కరుణ్ నాయర్ (40)లు అర్ధ శతక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. అయితే.. హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న నాయర్‌ను స్టోక్స్ ఔట్ చేసి రెండో వికెట్ అందించాడు.