ఆత్మకూరు (ఎం), జూలై 11 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ కోటా 42 శాతం బిల్లు పార్లమెంట్లో ఆమోదింపజేసి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని బీఆర్ఎస్ ఆత్మకూరు (ఎం) మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంచే ఆర్డినెన్స్ తీసుకువచ్చి తెలంగాణలోని బీసీలను, అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని, ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు కొప్పుల హరిదీప్ రెడ్డి, జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరే భిక్షపతి, మాజీ ఎంపీటీసీ యాస కవిత, మహిళా అధ్యక్షురాలు సోలిపురం అరుణ, యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రతికంఠం శాంతన్ రాజు, చుంచు నాగరాజు, సింగారం మాజీ ఎంపిటిసి పల్లెర్ల సత్యనారాయణ, కొరటికల్ మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, మండల ఉపాధ్యక్షులు గుడ్డేటి శ్రీనివాస్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దుంప పరశురాములు, సీనియర్ నాయకులు నాతి స్వామిగౌడ్, మహేందర్ రెడ్డి, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్, విద్యార్థి నాయకులు గడ్డం సతీశ్, నాతి మల్లికార్జున్, యాట మల్లేశ్, ఎర్ర నవీన్ రెడ్డి పాల్గొన్నారు.