రామన్నపేట, జూలై 11 : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎంపీడీఓగా ఆవుల రాములు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన యాకూబ్ నాయక్ నల్లగొండ జిల్లాకు బదిలీపై వెళ్లారు. బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓ యాకూబ్ నాయక్‌ను పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం నుండి వచ్చిన ఎంపీడీఓ రాములుకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం సలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రవూఫ్, ఏపీఓ వెంకన్న పాల్గొన్నారు.