నెక్కొండ జూలై 11 : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికిర గ్రామంలో శుక్రవారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని ఆగంతకులు మాస్కులు, హెల్మెట్ ధరించి ఓ ఇంట్లోకి చొరబడి మహిళను బెదిరించి రూ.02. 32 లక్షల విలువైన బంగారు నగలను దోచుకెళ్లినట్లు నెక్కొండ ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో పనికర గ్రామంలోని బండారి నిరోషా ఇంట్లోకి ఇద్దరు గుర్తుతెలియని చొరబడి సదరు మహిళ మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురిచేశారు.
బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న గోల్డ్ నెక్లెస్, రెండు బంగారు ఉంగరాలు, కమ్మలు, మాటీలు, నగదు ఎత్తుకెళ్లారు. నిరోషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన వస్తువుల విలువు సుమారు రూ.2,32,000 ఉంటుందని ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.