Wimbledon : టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ వరుసగా వింబుల్డన్ (Wimbledon) మూడో టైటిల్ వేటకు సిద్దమయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్(అమెరికా)ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నాలుగు సెట్ల పోరులో తనదైన దూకుడు కొనసాగించిన స్పెయిన్ స్టార్ ఫ్రిట్జ్ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లాడు. వరుసగా 24వ విజయంతో మూడో ఏడాది కూడా టైటిల్ వేటలో నిలిచాడీ టెన్నిస్ సంచలనం.
భారీ అంచనాల నడుమ వింబుల్డన్ బరిలో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ అల్కారాజ్ సెమీఫైనల్లో ఛాంపియన్ ఆటతో రెచ్చిపోయాడు. తొలి సెట్‌ను 6-4తో గెలుచుకున్న అతడికి టేలర్ రెండో సెట్లో షాకిచ్చాడు. అయితే.. ఆ తర్వాత పుంజుకున్న అల్కారాజ్ మూడో సెట్లో అమెరికా స్టార్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 6-3తో పైచేయి సాధించిన స్పెయిన్ కెరటం.. నాలుగో సెట్‌ను ఒక్క పాయింట్ తేడాతో గెలుపొందాడు.
Carlos Alcaraz is a #Wimbledon finalist for the THIRD YEAR IN A ROW 😮
The two-time defending champion defeats Taylor Fritz 6-4, 5-7, 6-3, 7-6(6) to put one hand on the Gentlemen’s Singles Trophy – and Centre Court ROARS for the Spaniard 🇪🇸
Utterly sensational. pic.twitter.com/Twy6y6vK6V
— Wimbledon (@Wimbledon) July 11, 2025
‘వింబుల్డన్‌లో రికార్డు విజయాల గురించి నేను ఆలోచించడం లేదు. మ్యాచ్ ఫలితాల గురించి నేను ఆందోళన చెందడం లేదు. నా లక్ష్యం మీదే దృష్టి సారించాను. ప్రస్తుతానికి నేను ఆదివారం జరుగబోయే ఫైనల్ గురించి కూడా పెద్దగా ఆలోచించడం లేదు. సెమీస్ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. మరోసారి ఫైనల్ చేరినందుకు చాలా హ్యాపీగా ఉంది’ అని అల్కరాజ్ అన్నాడు. 2023లో జకోవిచ్‌ను మట్టికరిపించి తొలిసారి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించిన అల్కారాజ్.. నిరుడు కూడా జకోకు ట్రోఫీని దక్కనివ్వలేదు. సో.. ముచ్చటగా మూడోసారి కూడా అతడు టైటిల్‌పై కన్నేశాడు.