Newzealand | వరల్డ్ కప్ హీరోకు టెస్టు చాన్స్.. కేన్ మామ వచ్చేస్తున్నాడు
Newzealand : న్యూజిలాండ్ జట్టు సొంతగడ్డపై త్వరలోనే దక్షిణాఫ్రికా(South Africa)తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) 2023-25 సైకిల్లో కివీస్‌కు ఈ రెండు మ్యాచ్‌లు చాలా కీలకం. అందకని ఆ దేశ బోర్డు శుక్రవారం 14 మందితో కూడిన పటిష్టమైన..
Newzealand : న్యూజిలాండ్ జట్టు సొంతగడ్డపై త్వరలోనే దక్షిణాఫ్రికా(South Africa)తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) 2023-25 సైకిల్లో కివీస్‌కు ఈ రెండు మ్యాచ్‌లు చాలా కీలకం. అందకని ఆ దేశ బోర్డు శుక్రవారం 14 మందితో కూడిన పటిష్టమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. టిమ్ సౌథీ కెప్టెన్‌గా ఎంపికైన ఈ బృందంలో యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra)కు చోటు దక్కింది. అంతేకాదు పాకిస్థాన్ టీ20 సిరీస్‌లో గాయపడిన కేన్ విలియమ్సన్(Kane Williamson)ను కూడా ఎంపిక చేశారు.
సిరీస్‌కు మరో వారం ఉన్నందున ఆలోపు కేన్ మామ ఫిట్నెస్ సాధించే చాన్స్ ఉంది. యంగ్‌స్టర్ విల్ ఓ రూర్కీ() ఈ సిరీస్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు సఫారీ జట్టు మాత్రం ఏకంగా 8 మంది కొత్తవాళ్లను ఎంపిక చేసింది. సొంతగడ్డపై ఎస్ఏ 20 రెండో సీజన్ జరుగుతున్నందున కీలక ఆటగాళ్ల బదులు కుర్రాళ్లతో స్క్వాడ్‌ను ప్రకటించింది.
The first Test squad of the home summer is here! Read more | https://t.co/JZZS3Mb6iR #NZvSA pic.twitter.com/4Fcqv8ut59
— BLACKCAPS (@BLACKCAPS) January 25, 2024
న్యూజిలాండ్ స్క్వాడ్ : రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, టామ్ బండిల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిఫ్స్, విల్ ఓ రూర్కే, నీల్ వాగ్నర్, టిమ్ సౌథీ(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, మిచెల్ శాంట్నర్.
సఫారీ, న్యూజిలాండ్ మధ్య బే ఓవల్ స్టేడియంలో ఫిబ్రవరి 4న తొలి టెస్టు జరుగనుంది. రెండో టెస్టు హమిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో ఫిబ్రవరి 13న షురూ కానుంది. ఈ టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో తలపడింది. రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకొని పరువు దక్కించుకుంది.

మరోవైపు ప్రొటిస్ జట్టు కూడా భారత్‌తో రెండు మ్యాచ్‌లు ఆడింది. సెంచూరియన్ టెస్టులో అద్భుత విజయం సాధించినా.. న్యూలాండ్స్‌లో భారత బౌలర్ల ధాటికి 1-1తో సిరీస్ డ్రా చేసుకుంది. దాంతో, డబ్ల్యూటీసీ సైకిల్‌తో పాటు, టెస్టు ర్యాంకింగ్స్‌లో వెనకబడిన ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది.
ఇవి కూడా చదవండి
- Australian Open | ఫైనల్లో మెద్వెదేవ్.. ఓడినా ఆకట్టుకున్న జర్మనీ స్టార్
- Road Accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- Telangana | 231 మంది ఖైదీలకు విముక్తి
- NCL Recruitment 2024 | నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

