NCL Recruitment 2024 | ఇ అండ్ టి, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టుల భర్తీకి మధ్యప్రదేశ్ (MP)లోని నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (Northern Coalfields Limited) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత రంగంలో పదో తరగతి/ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Application Process) ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 05 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 150
పోస్టులు : అసిస్టెంట్ ఫోర్‌మెన్
విభాగాలు : ఇ అండ్ టి, మెకానికల్, ఎలక్ట్రికల్
అర్హతలు : పదో తరగతి/ డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
వయసు: 18-26 ఏండ్లు ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం : నెలకు రూ.47,330.
చివరి తేది: ఫిబ్రవరి 05
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.1180.
వెబ్సైట్ : www.nclcil.in