IPL 2025 : ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అభిమానులకు గుడ్ న్యూస్. 18వ సీజన్లో ఆడేందుకు కగిసో రబడ (Kagiso Rabada)కు లైన్ క్లియర్ అయింది. నిషేధిత డ్రగ్ తీసుకున్నందుకు సస్పెండ్ అయిన ఈ స్పీడ్‌స్టర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నాడు. రెండు సెసన్ల కౌన్సెలింగ్ పూర్తికావడంతో అతడిపై విధించిన నిషేధాన్ని దక్షిణాఫ్రికా బోర్డు ఎత్తేసింది.
దాంతో, నిషేధం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన రబడ త్వరలోనే గుజరాత్ జట్టుతో కలువనున్నాడు. ఇప్పటికే ప్రసిధ్, సిరాజ్(Siraj), ఇషాంత్‌లతో పటిష్ఠంగా ఉన్న ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఈ సఫారీ పేసర్ రాకతో మరింత దుర్భేద్యంగా మారనుంది.
🚨 GOOD NEWS FOR SOUTH AFRICA & GUJARAT TITANS 🚨
– South African Institute for Drug Free Sports confirmed that Kagiso Rabada’s ban is over and he is allowed to resume the playing immediately. [Club Cricket SA] pic.twitter.com/Pdr1EWWm7x
— Johns. (@CricCrazyJohns) May 5, 2025
ఈ ఏడాది స్వదేశంలో జరిగిన ఎస్ఏ 20 లీగ్‌లో నిషేధిత డ్రగ్ తీసుకున్నట్టు రబడ ఆరోపణలు వచ్చాయి. జనవరి 21న ఎంఐ కేప్‌టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ మ్యాచ్ తర్వాత అతడికి డోప్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అతడి రక్త నమూనాల్లో నిషేధిత డ్రగ్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఐపీఎల్ 18వ సీజన్ కోసం రబడ భారత్‌కు వచ్చేశాడు. రెండు మ్యాచులు కూడా ఆడాడు.
South Africa fast bowler Kagiso Rabada has served a one-month ban, and will be available for South Africa for the WTC final against Australia next month pic.twitter.com/25MXzDOPEK
— ESPNcricinfo (@ESPNcricinfo) May 5, 2025
కానీ, డోప్ టెస్టులో పట్టుబడిన అతడిని స్వదేశం రావాల్సిందిగా దక్షిణాఫ్రికాకు చెందిన డ్రగ్ ఫ్రీ స్పోర్ట్స్ ఆదేశించింది. దాంతో, సొంత గడ్డకు వెళ్లిన ఈ స్పీడ్‌గన్ అక్కడ చికిత్సతో పాటు.. రెండు సెషన్లు కౌన్సెలింగ్ తీసుకున్నాడు. అందుకని.. అతడిపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని బోర్డు ఎత్తేసింది. సో.. ఈ స్పీడ్‌స్టర్ గుజరాత్ జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 10 మ్యాచుల్లో 7 విజయాలతో టాప్ -4లో నిలిచిన శుభ్‌మన్ గిల్ సేన ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. మే 6న ముంబై ఇండియన్స్, మే 11న ఢిల్లీ క్యాపిటల్స్, మే 14న లక్సో సూపర్ జెయింట్స్‌తో గుజరాత్ తలపడనుంది.