ఆమనగల్లు : ధాన్యం అమ్మడానికి ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మార్కెట్‌కమిటీ చైర్పర్సన్ భోజన వసతిని ( Lunch for Farmers ) మంచి మనసును చాటుకున్నారు. తన సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ( Chairpersons ) యాటగీత నర్సింహ్మ ( Geeta Narasimha) తెలిపారు.
సోమవారం ఆమనగల్లు మార్కెట్ యార్డులో మధ్యాహ్న భోజనాన్ని ఆమె ప్రారంభించారు. వేసవి ముగిసే వరకు ప్రతిరోజు మధ్యాహ్నం రైతులకు భోజన సదుపాయం కల్పిస్తానని వెల్లడించారు. అదే విధంగా మార్కెట్ యార్డులో త్రాగునీరు, ధాన్యం భద్రపరచడానికి టార్ఫాలిన్ కవర్లు ఆందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ , ఏఎంసీ డైరెక్టర్లు వస్పుల శ్రీశైలం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.