PV Sindhu | భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) తిరుపతిలోని తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవలే సింధు వివాహం హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత కొత్త దపంతులు అమ్మవారి ఆశీస్సుల కోసం తిరుమతి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి సింధు-దత్త సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని.. పెళ్లి తర్వాత అమ్మ ఆశీస్సుల కోసం వచ్చినట్లు సింధు తెలిపారు.
కాగా, పీవీ సింధు – వెంకట దత్తసాయి వివాహం ఈనెల 22న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా సింధు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా జరిగింది. పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
“PV Sindhu | ఆ ప్రయాణమే మమ్మల్ని దగ్గర చేసింది.. దత్త సాయితో తన ప్రేమ కథను బయటపెట్టిన సింధు”
“PV Sindhu: పీవీ సింధు పెళ్లి జరిగిన రిసార్టు విశేషాలు మీకు తెలుసా?”
“PV Sindhu | గ్రాండ్‌గా పీవీ సింధు-వెంటక దత్తసాయి రిసెప్షన్.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు”
“PV Sindhu | పీవీ సింధు పెళ్లి ఫొటోలు చూశారా..?”
“PV Sindhu | అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఫొటో వైరల్”