PV Sindhu: పీవీ సింధు పెళ్లి జరిగిన రిసార్టు విశేషాలు మీకు తెలుసా?
PV Sindhu: పీవీ సింధు కళ్యాణ వేదిక ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఉదయ్‌పూర్‌లోని రఫేల్స్ హోటల్ రిసార్టులో ఆమె పెళ్లి జరిగింది. ఆ ఖరీదైన హోటల్లో ఒక రోజు బస చేయాలంటే లక్ష చెల్లించాల్సిందే.
హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu).. హైదరాబాదీ వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ జంట ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టులో పెళ్లాడారు. ఆ వెడ్డింగ్ వేదిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా విలాసవంతమైన, ప్రత్యేకమైన రఫేల్స్ ఉదయ్‌పూర్ రిసార్టులో సింధు పెళ్లి జరిగింది. ఆ కళ్యాణ వేదిక ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.
సుందరమైన ప్రదేశంలో ఉన్న ఆ ఫైవ్ స్టార్ స్పాట్.. సింధు జీవితంలో ఓ ప్రత్యేకంగా నిలిచింది. 21 ఎకరాలు ఉన్న ఆ ప్యాలెస్ .. ఫ్రెంచ్ ఆల్ట్రా లగ్జరీ బ్రాండ్ రఫేల్స్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రాపర్టీగా గుర్తింపు ఉన్నది. సింగపూర్‌కు చెందిన రఫేల్స్ హోటల్ కూడా ఆ వేదికలోనే ఉన్నట్లు తెలిసింది. ఉదయ్ సాగర్ చెరువు మధ్యలో ఆ హోటల్ ఉంది. అరావలీ పర్వత అందాలు అక్కడ పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తుంటాయి. రిసార్టులోని వృక్షాలు,జంతువులు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.
ఆ ఖరీదైన హోటల్లో ఒక రాత్రి అకామిడేషన్ సుమారు లక్ష వరకు ఉంటుందని భావిస్తున్నారు. ప్రైవేట్ పూల్స్, ఆర్ట్‌వర్క్స్, లాన్లు.. ఎంతో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. యురోప్కు చెందిన పల్లాడియన్ ఆర్కిటెక్చర్ స్టయిల్లో ఆ హోటల్ ప్రాపర్టీని డెకరేట్ చేశారు. రాజ్‌పుత్-మొఘల్ ప్రావీణ్యం కూడా ఆ హోటల్ అందాల్లో కనిపిస్తుంది.
చాలా లగ్జరీ రూమ్‌లు, సూట్లు ఉన్నాయి. డైనింగ్, స్పా, రఫేల్స్ లాంగ్ బార్, రైటర్స్ బార్ ఉన్నాయి. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని మాజీ భార్య నటాషా స్టాన్కోవిక్.. గత ఏడాది ఈ హోటల్లోనే తమ వెడ్డింగ్ స్మృతులను గుర్తు చేసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

