PV Sindhu | అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఫొటో వైరల్
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)తో సింధు వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)తో సింధు వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన అభిమానులు సింధు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 24న (రేపు) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెస్షన్ ఏర్పాటు చేశారు.
కాగా, సింధు పెళ్లి చేసుకున్న వెంకట దత్త సాయి.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈనెల 14న వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీవీ సింధు, వెంకట దత్తసాయి రింగ్స్ మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ ఫొటోను సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ… ‘ఒకరి ప్రేమనకు దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి’ అని క్యాప్షన్ ఇచ్చింది.
Also Read..
“PV Sindhu | సింధుకు కాబోయే భర్త ఎవరు..? ఐపీఎల్‌తో అనుబంధం.. ఆసక్తికర విషయాలు మీకోసం”
“PV Sindhu | మా పెళ్లికి రండి..! సచిన్‌ను ఆహ్వానించిన పీవీ సింధు జంట..”
“PV Sindhu | పవన్‌కల్యాణ్‌కు వివాహా ఆహ్వాన పత్రికను అందజేసిన పీవీ సింధు”
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

