PV Sindhu | మా పెళ్లికి రండి..! సచిన్‌ను ఆహ్వానించిన పీవీ సింధు జంట..
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ నెలలో ఆమె హైదరాబాద్‌లో నివసించే వెంకట దత్త సాయితో ఏడు అడుగులు వేయబోతున్నది. 22న ఉదయపూర్‌లోని లేక్స్ నగరంలో వివాహం జరుగనున్నది. ఈ క్రమంలో ఆదివారం కాబోయే భర్తతో కలిసి భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను కలిసింది.
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ నెలలో ఆమె హైదరాబాద్‌లో నివసించే వెంకట దత్త సాయితో ఏడు అడుగులు వేయబోతున్నది. 22న ఉదయపూర్‌లోని లేక్స్ నగరంలో వివాహం జరుగనున్నది. ఈ క్రమంలో ఆదివారం కాబోయే భర్తతో కలిసి భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను కలిసింది. సింధు, వెంకట దత్త సాయి జోడీ లెజెండరీ ప్లేయర్‌ను తమ పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సచిన్ సోషల్ మీడియా వేదికగా ఫొటోను షేర్ చేశారు. త్వరలోనే వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న జంటకు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లికి రావాలని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇద్దరూ జీవితాంతం అద్భుతమైన జ్ఞాపకాలతో ఆనందంగా ఉండాలని సచిన్ ఆకాంక్షించారు.
డబుల్ ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ అయిన పీవీ సింధు పోసెడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని వివాహం చేసుకోనున్నది. డిసెంబర్ 20 నుంచి వివాహ వేడుకలు మొదలవనున్నాయి. 22న ఉదయ్‌పూర్‌లో వివాహం జరుగనున్నది. రెండు కుటుంబాలు 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. రెండు కుటుంబాలకు మధ్య పరిచయం ఉండగా.. నెలరోజుల కిందట వివాహం నిశ్చయించారు. జనవరి నుంచి మళ్లీ పీవీ సింధు షెడ్యూల్ బిజీ ఉండనుండగా.. పెళ్లికి సాధ్యమయ్యే విండో ఇది మాత్రమేనని ఆమె తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. వచ్చే సీజన్‌కు ప్రాధాన్యతత నేపథ్యంలో సింధు తన శిక్షణను త్వరలో మొదలుపడుతుదని చెప్పారు.
In badminton, the score always starts with ‘love’, & your beautiful journey with Venkata Datta Sai ensures it continues with ‘love’ forever! ♥️🏸
Thank you for personally inviting us to be a part of your big day. Wishing you both a lifetime of smashing memories & endless rallies… pic.twitter.com/kXjgIjvQKY— Sachin Tendulkar (@sachin_rt) December 8, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
Trainee Aircraft Skids Off Runway | రన్‌వే నుంచి పక్కకు జారిన శిక్షణ విమానం.. ట్రైనీ పైలట్‌కు తప్పిన ప్రమాదం
Monal Gajjar | క్యాన్సర్‌ను జయించిన టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్.!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

