హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు పెండ్లి కళ వచ్చేసింది. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు కాగా, శనివారం హైదరాబాద్‌లో సింధు, వెంకటదత్త సాయి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈనెల 22న ఉదయ్‌పూర్(రాజస్థాన్)లో వివాహం జరుగనుండగా, 24న హైదరాబాద్‌లో రిసెస్షన్ ఏర్పాటు చేసినట్లు సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా, క్రికెట్ దిగ్గజం సచిన్‌తో పాటు పలువురు ప్రముఖులను స్వయంగా కలిసిన సింధు తన పెండ్లి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన సింధు పెండ్లి పత్రిక అందజేసింది. ఈ కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులు పాల్గొన్నారు.