అమరావతి : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu ) ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ( Pawankalyan) కలిశారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక (Wedding invitation) అందజేశారు. ఆమె వెంట తండ్రి పి.వి. రమణ ఉన్నారు. పీవీ సింధూ ఈనెల 22న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె దేశంలోని ప్రముఖ క్రీడాకారులకు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు , ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఆహ్వాన పత్రికను అందజేశారు.