న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీ(Auqib Nabi) .. రఫాడిస్తున్నాడు. ప్రస్తుతం రంజీ సీజన్లో అతను ఇప్పటికే 60 వికెట్లు తీసుకున్నాడు. ఇక కర్నాటకతో జరుగుతున్న ఫైనల్స్ తొలి ఇన్నింగ్స్‌లో అతను తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. పేస్ బౌలర్ నబీ బౌలింగ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో నబీ దేశానికి ఆడనున్నట్లు గంగూలీ పేర్కొన్నారు. తొలి ఇన్సింగ్స్‌లో కర్నాటకను ఆలౌట్ చేయడంలో నబీ కీలక పాత్ర పోషించాడు.
𝐔𝐧𝐟𝐢𝐥𝐭𝐞𝐫𝐞𝐝 𝐣𝐨𝐲 𝐟𝐨𝐫 𝐚𝐧 𝐮𝐧𝐛𝐞𝐥𝐢𝐞𝐯𝐚𝐛𝐥𝐞 𝐜𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 🤩
🎥 𝙍𝙖𝙬 𝙍𝙚𝙖𝙘𝙩𝙞𝙤𝙣𝙨 from the middle as Auqib Nabi bags his 7th fifer to reach 60 wickets for the season 👏
Updates ▶️ https://t.co/G0ytZLEyNB#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/DXzNRLEkZp
— BCCI Domestic (@BCCIdomestic) February 27, 2026
హుబ్లీలో జరుగుతున్న మ్యాచ్‌లో ఇవాళ నాలుగో రోజు కర్నాటక తన తొలి ఇన్నింగ్స్‌లో 93.3 ఓవర్లలో 293 రన్స్ కే ఆలౌటైంది. ప్రయత్నం, ఉత్సాహం ఉంటే ఏం చేయగలమో జమ్మూకశ్మీర్ ఈ ప్రపంచానికి చాటిందని గంగూలీ తన ఎక్స్ అకౌంట్లో అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు తమ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిందన్నారు.
J&K has shown the world what effort and intent can do ..They have made that region so proud of them .. tuff environment makes tuff people. Aqib nabi on his way to national colours .. england is the place to start in the summer @bcci @imAagarkar @lonsaikia
— Sourav Ganguly (@SGanguly99) February 27, 2026