PV Sindhu | భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)తో సింధు వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా సింధు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా జరిగింది. పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అయితే, వెంకట దత్త సాయితో తన లవ్ స్టోరీ గురించి సింధు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఓ విమాన ప్రయాణం తమని కలిపిందని చెప్పుకొచ్చింది. ‘2022 అక్టోబర్‌లో మేమిద్దరం ఒకే విమానంలో ప్రయాణించాం. ఆ ప్రయాణంతో అంతా మారిపోయింది. ఆ జర్నీ మమ్మల్ని మరింత దగ్గర చేసింది. అదంతా లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా అనిపించింది. అప్పటి నుంచే మా లవ్ జర్నీ మొదలైంది’ అని దత్త సాయితో తన లవ్ స్టోరీ గురించి సింధు వివరించింది.
నిశ్చితార్థం కూడా చాలా సింపుల్‌గా.. అత్యంత సన్నిహితుల మధ్య జరిగినట్లు సింధు వెల్లడించింది. ‘నిశ్చితార్థం చాలా సింపుల్‌గా జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని సింపుల్‌గా చేసుకోవాలనుకున్నాం. ఆ క్షణం ఉద్వేగభరితమైనది. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం’ అని సింధు తెలిపింది. ఇక పెళ్లి ప్లానింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘మా పెళ్లిని ప్లాన్ చేసుకోవడం అందమైన, సవాలుతో కూడుకున్నది. ప్రొఫెషనల్ అథ్లెట్‌గా నాకు బిజీ షెడ్యూల్ ఉనప్పటికీ.. మా జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టం కోసం అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నా. అందుకు దత్తా కూడా తనవంతు సాయం చేశాడు’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read..
“PV Sindhu | పీవీ సింధు పెళ్లి ఫొటోలు చూశారా..?”
“PV Sindhu | గ్రాండ్‌గా పీవీ సింధు-వెంటక దత్తసాయి రిసెప్షన్.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు”
“PV Sindhu: పీవీ సింధు పెళ్లి జరిగిన రిసార్టు విశేషాలు మీకు తెలుసా?”