Prithvi Shaw : దేశవాళీ సీజన్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ భారత యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లుగా ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న షా కొత్త జట్టుకు మారాలనుకుంటున్నాడు. అందుకని ఆలస్యం చేయకుండా ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA)కు లేఖ రాశాడు. తనకు ఈ సీజన్లో రాష్ట్ర జట్టుకు ఆడాలనే ఉద్దేశం లేదని.. ఇతర రాష్ట్రాల జట్ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్న షా.. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇవ్వాలని అభ్యర్థించాడు.
గత సీజన్లో ఫిట్నెస్ లేదంటూ అతడిని రంజీ ట్రోఫీ స్క్వాడ్ నుంచి తప్పించింది ఎంసీఏ. దాంతో, ఈసారి కూడా పక్కనపెడితే తన భవిష్యత్ నాశనం అవుతుందనుకున్న షా.. ముంబైని వీడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని సోమవారం ఎంసీఏ మీడియాకు వెల్లడించింది. ‘ఎన్ఓసీ కావాలని పృథ్వీ షా మాకు ఉత్తరం రాశాడు. ఈ విషయాన్ని మేము అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాం. అతడికి త్వరలోనే ఎన్ఓసీ మంజూరు చేస్తాం’ అని ఎంసీఏ సెక్రటరీ తెలిపాడు క్రిక్‌బజ్ కథనం రాసుకొచ్చింది.
🚨 NEWS ALERT 🚨
Prithvi Shaw has reportedly sought an NOC from Mumbai Cricket Association, aiming to play as a ‘professional’ for another state! 👀📝
This comes after MCA advised him to shed some weight for a comeback.
New chapter loading for Shaw? 📖🔥#PrithviShaw pic.twitter.com/Ia7cHhnv7Y
— Cricket Impluse (@cricketimpluse) June 23, 2025
ఎన్ఓసీ కోసం లేఖ రాసిన లేఖలో షా తన కెరియర్ పుంజుకొనే అవకాశాల్ని ప్రస్తావించాడు. తనకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు ఆఫర్లు వస్తున్నాయని తెలిపాడు. ‘ప్రస్తుతం నా కెరియర్ మీద దృష్టి సారించాలనుకుంటున్నా. ఇతర రాష్ట్రాల బోర్డుల తరఫున ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నా. నన్ను నేను మెరుగుపరుచుకోవడంతో పాటు క్రికెటర్‌గా మునపట్లో ఆడినట్టు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కాబట్టి దయచేసి నాకు ఎన్ఓసీ ఇవ్వండి. అప్పుడు నేను అధికారికంగా దేశవాళీ సీజన్లో ఇతర జట్లకు ఆడగలను’ అని షా తన లేఖలో వెల్లడించాడు.
దేశవాళీలో రికార్డు సెంచరీలతో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వారసుడిగా కితాబులందుకున్న షా.. 2018లో టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో సెంచరీతో భావి తారగా ప్రశంసలందుకున్న అతడు.. అంచనాలను అందుకోలేకపోయాడు. విధ్వంసక బ్యాటర్‌గా జట్టుకు ఎంతో పనికొస్తాడని అభిమానులను నిరాశపరుస్తూ.. పాతాళానికి పడిపోయాడు. ఫిట్నెస్ కోల్పోవడం.. చెడు తిరుగుళ్లు కూడా అతడి ఫామ్‌పై ప్రభావం చూపాయి. ఇప్పటివరకూ ఈ యంగ్‌స్టర్ దేశం తరఫున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, ఒక టీ20 ఆడాడు.