నందిగామ, జూన్ 23: యువత మత్తు పదార్థాలతో జీవితాలను చిత్తు చేసుకోకూడదని నందిగామ సీఐ ప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సీఐ ప్రసాద్ సోమవారం విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ప్రస్తుతం చెడు వ్యసనాలకు అలవాటు పడి మత్తు ఇచ్చే గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి ఇతర పదార్థాలకు అలవాటుపడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారన్నారు. ఎట్టి పరిస్థితిలో మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం తెలిస్తే నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు
ఎవరైనా ఇలాంటి మత్తు పదార్థాలు సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా సోషల్ మీడియాకు యువత అలవాటు పడి సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు సైబర్ నేరాలకు గురవుతున్నారని, ఇలాంటివి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దేవరాజు, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాద్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.