Air India Express | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కుప్పకూలినప్పటి నుంచి ఆ సంస్థకు చెందిన పలు విమానాల్లో ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం అనూహ్యంగా ల్యాండ్ (landing) అవ్వకుండానే ఢిల్లీకి తిరిగి వచ్చేసింది.
IX-2564 విమానం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయల్దేరింది. మధ్యలో ఆ విమానం జమ్ములో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, పైలట్ విమానాన్ని జమ్ము ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయలేదు. జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై కొద్దిసేపు విమానం చక్కర్లు కొట్టిన అనంతరం అది తిరిగి ఢిల్లీకి వచ్చింది. వాతావరణం అనుకూలంగా ఉందని, రన్‌వే కూడా క్లియర్‌గా ఉన్నప్పటికీ.. ల్యాండింగ్ ప్రాంతాన్ని పైలట్ గుర్తించలేకపోయాడని అధికారులు పేర్కొన్నారు. అయితే, విమానం ఢిల్లీకి తిరిగి రావడానికి దారితీసిన కారణాలు మాత్రం తెలియరాలేదు.
Also Read..
Pahalgam | పహల్గాంకు పర్యాటకులు క్యూ.. ఫొటోలు షేర్ చేసిన జమ్ముకశ్మీర్ సీఎం
Air India Express | లగేజ్ లేకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ల్యాండ్.. ప్రయాణికులు ఆగ్రహం
By-election | బీజేపీకి షాక్.. విసవదార్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆప్ ఘన విజయం