Headingley Test : హెడింగ్లే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు (Team India) భారీ స్కోర్ దిశగా సాగుతోంది. నాలుగో రోజు తొలి సెషన్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (8)ఔటైనా.. కేఎల్ రాహుల్(54 నాటౌట్) సంయమనంతో ఆడుతున్నాడు. మూడో రోజు కళాత్మక కవర్ డ్రైవ్‌లతో అలరించిన రాహుల్.. బ్రాండన్ కార్సే బౌలింగ్‌లో రెండు రన్స్ తీసి అర్ధ శతకం బాదేశాడు.
మరోవైపు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(17 నాటౌట్) కూడా దూకుడు పెంచాడు. వీళ్లిద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు 34 రన్స్ జోడించారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 118 రన్స్ స్కోర్ చేసిన టీమిండియా 124 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Fifty up for KL Rahul 👏
Can he make it a big one?
🔗 https://t.co/ShJazRewwb pic.twitter.com/YvxkPF8D3I
— ESPNcricinfo (@ESPNcricinfo) June 23, 2025
తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం సాధించిన టీమిండియా.. మ్యాచ్‌పై పట్టుబిగేంచే దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 90/2తో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు కార్సే షాకిచ్చాడు. గిల్‌ను బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేకిచ్చాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్(17 నాటౌట్) కూడా ఒక కార్సే ఓవర్లో లైఫ్ లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్(147), పంత్(138), యశస్వీ జైస్వాల్(101) సెంచరీలతో చెలరేగగా టీమిండియా 471 రన్స్ కొట్టింది. అనంతరం జస్ప్రీత్ బుమ్రా ధాటికి ఆతిథ్య జట్టు 465 పరుగులకు ఆలౌటయ్యింది. ఆ జట్టులో ఓలీ పోప్(106), హ్యారీ బ్రూక్ (99), బెన్ డకెట్(62)లు రాణించారు.