Actor Sriram | కోలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. మాజీ ఏఐడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనతో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్‌ను కూడా అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కి తరలించి అక్కడే ఆయన్ని రెండు గంటల పాటు అనేక కోణాల్లో విచారించారు.
ఈ కేసులో శ్రీరామ్‌తో పాటు ప్రసాద్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో చెన్నై పోలీసులు విచారణ చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన సమాచారంతోనే నటుడిని చెన్నై పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీరామ్ అరెస్ట్ కోలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నటుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించి అనంతరం అతడిని నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించారు. దాదాపు రెండు గంటలుగా విచారిస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.
శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్ కాగా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి. సినిమాలపై ఇష్టంతో చెన్నైకి వెళ్లాడు. తన పేరును శ్రీరామ్‌గా మార్చుకున్నాడు. తమిళ చిత్రం రోజా కూటంతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా, ఈ చిత్రం తెలుగులో రోజా పూలు పేరుతో విడుదలైంది. ‘ఒకరికి ఒకరు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఒకరికి ఒకరు తదితర చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. ఈ మధ్య ‘హరికథ’ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు శ్రీరామ్ అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.