INDW vs ENGW : స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు(Womens Team) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. మొదట తొలి ఇన్నింగ్స్‌లో 428 రన్స్ కొట్టిన టీమిండియా.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఇంగ్లండ్ (England) జట్టును బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా యువ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్(Pooja Vastrakar) మెరుపు ఫీల్డింగ్‌తో ఔరా అనిపించింది. రాజేశ్వరీ గైక్వాడ్ వేసిన ఓవర్లో స్టార్ బ్యాటర్ బ్యూమంట్(10)ను అద్భత త్రోతో రనౌట్ చేసింది.
స్ట్రయికింగ్‌లో ఉన్న నాట్ సీవర్ బ్రంట్(59) బంతిని లెగ్ సైడ్ ఆడి సింగిల్ తీయాలనుకుంది. అయితే.. అక్కడే కాచుకొని ఉన్న పూజ బంతిని అందుకొని మెరపు వేగంతో వికెట్ల మీదికి విసిరింది. నాన్‌స్ట్రయికర్ బ్యూమంట్ రనౌట్ తప్పించుకునేందుకు డైవ్ చేసింది. అప్పటికే బంతి వికెట్లను గిరాటేసింది. బీసీసీఐ పూజ రనౌట్ చేసిన వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Solid anticipation ✅
Clean pick-up ✅
Spot-on accuracy ✅𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎: Pooja Vastrakar’s fielding brilliance 🎥 🔽
Follow the Match ▶️ https://t.co/UB89NFaqaJ#TeamIndia | #INDvENG | @Vastrakarp25 | @IDFCFIRSTBank pic.twitter.com/hPBG9zy6XL
— BCCI Women (@BCCIWomen) December 15, 2023
తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ ఏదశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో హడలెత్తించింది. దాంతో, పర్యాటక జట్టు కూప్కూలింది. రెండో సెషన్లో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లీష్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రమాదకరమైన సోఫియా డంక్లే(11)ను రేణుకా సింగ్ వెనక్కి పంపింది.
ఐదు వికెట్లతో చెలరేగిన దీప్తి శర్మ
ఒకదశలో 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టును నాట్ సీవర్ బ్రంట్(35), టామీ బ్యూమంట్(6) ఆదుకున్నారు. వీళ్లు ఆచితూచి ఆడుతూ మూడో వికెట్‌కు 51 రన్స్ జోడించారు. అయితే.. దీప్తి శర్మ స్పిన్ ఉచ్చు బిగించి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఆమె బౌలింగ్‌లో ఎలా ఆడాలో తెలియక వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవిలియన్ చేరారు.
INDWvsENGW 1st Test: దీప్తి శర్మ ఫైఫర్.. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఖతం.. భారత్‌కు భారీ ఆధిక్యం
FIFA | ‘ఉత్తమ ఫుట్‌బాలర్’ అవార్డుకు తగ్గపోరు.. పోటీ పడుతున్నది వీళ్లే
David Miller | డీఆర్ఎస్ పనిచేయలే.. బతికిపోయిన దక్షిణాఫ్రికా హిట్టర్.. వీడియో