PM Modi | నాలుగు రోజుల క్రితం బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ (45th Chess Olympiad) ఓపెన్, మహిళల విభాగాల్లో భారత యువ చెస్ క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. స్వర్ణాలు గెలిచిన భారత బృందం టోర్నమెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని కలిశారు.
వైశాలి, హారిక, తానియా, విదిత్, సచ్దేవ్, ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి సహా స్వర్ణం గెలిచిన క్రీడాకారులతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గేమ్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారందరినీ పేరుపేరునా ప్రత్యేకంగా అభినందించారు. ఇక ప్రధాని సమక్షంలో ప్రజ్ఞానంద్, అర్జున్ ఓ గేమ్ కూడా ఆడారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ప్రధానికి చెస్ బోర్డును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
A wonderful interaction with the Indian chess contingent that won the 45th FIDE Chess Olympiad. Do watch! https://t.co/1fALfjTOe7
— Narendra Modi (@narendramodi) September 26, 2024
మరోవైపు స్వర్ణాలు గెలిచిన భారత బృందానికి ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) రూ.3.2 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 97 ఏండ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో చారిత్రక విజయం సాధించిన భారత చదరంగ వీరులకు సన్మానం సందర్భంగా ఏఐసీఎఫ్ అధ్యక్షుడు నితిన్ నారంగ్ నగదు బహుమతి ప్రకటన చేశారు.
ఆటగాళ్లకు రూ. 25 లక్షలు, పురుషుల, మహిళల జట్టు కోచ్‌లు అయిన అభిజిత్ కుంటె, శ్రీనాథ్ నారాయణన్‌కు తలా రూ.15 లక్షలు పంచనుండగా భారత బృందానికి చీఫ్‌గా వ్యవహరించిన దివ్యేందు బరువకు రూ.10 లక్షలు, అసిస్టెంట్ కోచ్‌లలో ఒక్కొక్కరికి రూ. 7.5 లక్షలు అందనున్నాయి. ఈ సందర్భంగా నితిన్ నారంగ్ మాట్లాడుతూ.. ‘చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణాలు నెగ్గాలన్న మన కోరిక నెరవేరింది. కానీ ఈ విజయయాత్ర మాత్రం కొనసాగుతుంది’ అని అన్నారు.
#WATCH | PM Narendra Modi interacted with Indian men’s and women’s teams which clinched their maiden gold medals in the 45th Chess Olympiad on September 22.
Chess grandmaster Vidit Gujrathi says, “He took out time for us even amid such a busy schedule. He encouraged us a… pic.twitter.com/WCie27MuCE
— ANI (@ANI) September 26, 2024
Also Read..
Sanjay Raut | పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష
Joe Biden | వెల్కమ్ టు వాషింగ్టన్.. న్యూయార్క్‌లో మరోసారి తడబడ్డ జో బైడెన్..! VIDEO
Manu Bhaker | ఒలింపిక్స్ పిస్టల్ ధర రూ.కోటి..?.. మను బాకర్ స్పందన ఇదే