IND vs NZ 1st Test : చిన్నస్వామి స్టేడియంలో భారత బ్యాటర్లు దంచి కొట్టారు. రెండో రోజు తమను వణికించిన న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించగా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన సర్ఫరాజ్ ఖాన్(70 నాటౌట్), విరాట్ కోహ్లీ(70)లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన ఈ జోడీ కివీస్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టింది.
మూడో వికెట్‌కు 136 పరుగులు కలిపిన విరాట్ ఆఖరి బంతికి ఔట్ అయ్యాడు. దాంతో మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 231రన్స్ కొట్టింది. ఈ టెస్టులో భారత్ ఇంకా 125 పరుగులు వెనకబడి ఉంది. మ్యాచ్ ఫలితంపై ఓ అంచనా వచ్చేందుకు నాలుగో రోజు తొలి సెషన్ కీలకం కానుంది.
Stumps on Day 3 in the 1st #INDvNZ Test!
End of a gripping day of Test Cricket 👏👏#TeamIndia move to 231/3 in the 2nd innings, trail by 125 runs.
Scorecard – https://t.co/FS97LlvDjY@IDFCFIRSTBank pic.twitter.com/LgriSv3GkY
— BCCI (@BCCI) October 18, 2024
ఒక్క రోజులోనే భారత జట్టు ఆటలో ఎంతో మార్పు. తడబడిన చోటే నిలబడిన టాపార్డర్ శుభారంభం ఇవ్వగా న్యూజిలాండ్ బౌలర్ల ఎత్తులు పారలేదు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(35) ఉన్నంత సేపు ధనాధన్ ఆడాడు. అయితే.. అజాజ్ పటేల్ ఓవర్లో ఫ్రంట్‌ఫుట్ వచ్చి స్టంపౌట్ అయ్యాడు. 72 వద్ద తొలి వికెట్ పడినా కెప్టెన్ రోహిత్ శర్మ(52) జోరు తగ్గించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో హడెలెత్తించిన మ్యాట్ హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదేసి హిట్‌మ్యాన్ అర్ధ శతకం సాధించాడు. కానీ, ఆ కాసేపటికే అజాజ్ పటేల్ ఓవర్లో ఊహించని విధంగా అతడు బౌల్డ్ అయ్యాడు.
𝟗𝟎𝟎𝟎 𝐓𝐞𝐬𝐭 𝐫𝐮𝐧𝐬 𝐚𝐧𝐝 𝐜𝐨𝐮𝐧𝐭𝐢𝐧𝐠….
A career milestone for @imVkohli 👏👏
He is the fourth Indian batter to achieve this feat.#INDvNZ @IDFCFIRSTBank pic.twitter.com/Bn9svKrgtl
— BCCI (@BCCI) October 18, 2024
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడినా విరాట్ కోహ్లీ(70), సర్ఫరాజ్ ఖాన్(70 నాటౌట్)లు ఒత్తిడికి లోనవ్వలేదు. కోహ్లీ కాస్త నిదానంగా ఆడితే.. సర్ఫరాజ్ మాత్రం కివీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఒ చెరో యాభై కొట్టేశారు. మెరుపు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ మూడో వికెట్‌కు 136 పరుగులు జోడించింది. అయితే..మూడో రోజు గ్లెన్ ఫిలిఫ్స్ వేసిన ఆఖరి ఓవర్.. చివరి బంతికి కోహ్లీ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. అంతే.. కివీస్ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు.
టీమిండియాను 50లోపే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్ రెండో రోజు.. మూడో రోజు రెండు సెషన్లలో పైచేయి సాధించింది. యువకెరటం రచిన్ రవీంద్ర(134) శతకంతో గర్జించగా.. మాజీ సారథి టిమ్ సౌథీ(65) మెరుపు హాఫ్ సెంచరీతో భారత బౌలర్లను ఆడుకున్నాడు. అంతకుముందు ఓపెనర్ డెవాన్ కాన్వే(91) సైతం అర్ధ శతకం బాదగా.. న్యూజిలాండ్ 402 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(372), కుల్దీప్ యాదవ్(399)లు రాణించారు.
Rachin Ravindra is the first New Zealand batter to score a Test century in India since Ross Taylor’s century at the same venue, Bengaluru, in 2012.
What an innings by the youngster!#INDvNZ Tim Southee #2024BigBillionPropertySale pic.twitter.com/FC0eUOKWVc
— Manakdeep Singh (@ManakdeepSingh) October 18, 2024
తొలి ఇన్నింగ్స్‌లో మ్యాట్ హెన్రీ(515), విలియం ఓ రూర్కీ(422)లు చెలరేగడంతో టీమిండియా 46 పరుగులకే పరిమితమై చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. స్వదేశంలో ఇంత తక్కువ స్కోర్‌కే కుప్పకూలడం ఇదే మొదటిసారి.