OG Movie | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రజలకు అందుబాటులో ఉంటునే సినిమాలకు సమయం కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు నటిస్తున్న హరిహర వీరమల్లు తో పాటు ఓజీ సినిమాలు షూటింగ్ మళ్లీ మొదలుపెట్టాయి. అయితే పవన్ నటిస్తున్న ఓజీ చిత్రం నుంచి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
‘సాహో’ (Saaho) ఫేం సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో పవన్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా.. తాజాగా షూటింగ్ ప్రారంభించింది ఈ చిత్రం ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా అభిమానులను అలరించాయి. అయితే తాజాగా ఈ మూవీలో నటుడు ప్రకాశ్ రాజ్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లో పవన్ జాయిన్ అయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా నటిస్తున్నారని టాక్. ప్రకాశ్ రాజ్ – పవన్ మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అలాగే వీరిద్దరిపై ఓ ఫైట్ సీన్ సైతం షూట్ చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా అభిమానులకి పండగ అని చెప్పుకోవాలి. తిరుమల లడ్డూ విషయంలో రీసెంట్గా వీరిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో షూటింగ్ సెట్స్‌లో వీళ్లు ఎలా ఉండబోతున్నారు అనేది హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ విషయంపై చిత్రబృందం అధికారిక ప్రకటన ఇవ్వవలసి ఉంది.