Virat Kohli : ప్రపంచ క్రికెట్లో రన్ మెషీన్గా, రికార్డుల రారాజుగా పేరొందిన విరాట్ కోహ్లీ(Virat Kohli ) మరో మైలురాయిని అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 9వేల పరుగుల క్లబ్లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో చెలరేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.
విలియం ఓర్కీ బౌలింగ్లో మిడాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతకు చేరువయ్యాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత క్రికెటర్గా క్రికెటర్గా రికార్డు పుస్తకాల్లో చేరాడు. కోహ్లీ కంటే ముందు దిగ్గజాలు సచిన్ టెండూల్కర్(15,921), రాహుల్ ద్రవిడ్(13,265), సునీల్ గవాస్కర్(10,212)లు ఈ మైలురాయిని అధిగమించారు.
𝟗𝟎𝟎𝟎 𝐓𝐞𝐬𝐭 𝐫𝐮𝐧𝐬 𝐚𝐧𝐝 𝐜𝐨𝐮𝐧𝐭𝐢𝐧𝐠….
A career milestone for @imVkohli 👏👏
He is the fourth Indian batter to achieve this feat.#INDvNZ @IDFCFIRSTBank pic.twitter.com/Bn9svKrgtl
— BCCI (@BCCI) October 18, 2024
తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన సర్ఫరాజ్ ఖాన్(52), విరాట్ కోహ్లీ(50)లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి.. చెరో యాభై కొట్టేశారు. మెరుపు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ మూడో వికెట్కు పరుగులు జోడించింది. దాంతో, భారత స్కోర్ బోర్డు వేగం అందుకోగా తొలి ఇన్నింగ్స్ లోటును తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 191/2 . ఇంకా రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 175 పరుగులు వెనకబడి ఉంది.