KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలపై తాను కేసులు వేశానని పేర్కొన్నారు. తాను వేసిన కేసులను విత్డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని చెప్పారు.
ఇప్పటివరకు తనను చంపుతామని బెదిరించారని కేఏ పాల్ తెలిపారు. అప్పుడు తనకు ఏమీ కాలేదని.. తనను బెదిరించిన వాళ్లే పోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తనకు ఏమీ కాదని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానని చెప్పారు. ఇకపై తనకు దేవుడే రక్ష అని తెలిపారు. తనపై కుట్ర పన్నిన వారు కలలో కూడా బాగుపడరని అన్నారు. తనను చంపాలని కుట్ర చేస్తున్నవారు కచ్చితంగా చనిపోతారని శపించారు.
నన్ను చంపుతామని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు: కేఏ పాల్
తెలంగాణాలో కొందరు ఎమ్మెల్యేలపై కేసు వేశాను
నేను వేసిన కేసులు విత్డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారు
గతంలో నన్ను చంపుతామని బెదిరించి తర్వాత వాళ్ళే పోయారు. ఇప్పుడు కూడా నన్ను చంపాలని చూస్తున్నవారు ఖచ్చితంగా చస్తారు… pic.twitter.com/5vNS55g3Gv
— BIG TV Breaking News (@bigtvtelugu) October 18, 2024
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపైనా కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. బాబు రావాలి.. జాబు రావాలి అన్నప్పుడే బాబు వస్తే ఏదీ జరగదని తాను చెప్పానని గుర్తు చేశారు. తిరుమలలో లడ్డూ కల్తీనే జరగలేదని తేలిన తర్వాత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని అన్నారు. తనను తాను తగ్గించుకున్న వాడు ధన్యుడు అని పవన్ కల్యాణ్ అంటారని.. కానీ ఏ విషయంలోనూ తాను తగ్గడని ఎద్దేవా చేశారు. ఏపీలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు లిక్కర్ వ్యాపారంలో వాటాలు అడుగుతున్నారని.. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం కోట్లు ఖర్చు చేసే వారిని జీవితకాలం సస్పెండ్ చేయాలని కోరారు. ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ ముద్దు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు.. బ్యాలెట్ వాడాలని సుప్రీంకోర్టులో పిల్ వేయబోతున్నట్లు వెల్లడించారు.