Virat Kohli : ప్రపంచ క్రికెట్లో ఫ్యాబ్ 4 ఆటగాళ్లపైనే అందరి కళ్లన్నీ నిలుస్తాయి. వాళ్ల బ్యాటింగ్ విన్యాసాలు.. రికార్డు సెంచరీల నుంచి ఘోర వైఫల్యాల వరకూ అన్నీ అభిమానులకే కాదు క్రీడా విశ్లేషకుల నోళ్లలో నానుతూనే ఉంటాయి. ఈమధ్య జో రూట్ (Joe Root) టెస్టుల్లో వరుస సెంచరీలతో ఫ్యాబ్ 4లో అగ్రస్థానం సాధించాడు. అలాగని ఆ జాబితాలోని విరాట్ కోహ్లీ(Virat Kohli), స్టీవ్ స్మిత్(Steven Smith), కేన్ విలియమ్సన్(Kane Williamson)ల ఘనతను తక్కువ చేయడానికి లేదంటున్నారు కొందరు.
మరీ ముఖ్యంగా టీమిండియా స్టార్ కోహ్లీపై ఈ ముగ్గురికంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని.. అయినా సరే అతడు ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు కోకొల్లలు అంటున్నారు మాజీ ఆటగాళ్లు పార్టీవ్ పటేల్, తమీమ్ ఇక్బాల్‌లు. ‘కోహ్లీపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. జో రూట్, స్మిత్, విలియమ్సన్లపై ఆ స్థాయిలో అంచనాల భారం ఉంటుందని నేను అనుకోను. కానీ కోహ్లీ ప్రతిసారి తనపై అభిమానుల అంచనాలను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు.
అయితే.. అతడు 60 లేదా 70 కొట్టినాస సరే విఫలమైనట్టే అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే.. విరాట్ మైదానంలోకి వచ్చిన ప్రతిసారి వంద కొట్టాలని వాళ్ల ఆశ. క్రీజులో ఉన్నంత సేపు కోహ్లీ దూకుడుగా ఆడాలని మనమంతా కోరుకుంటాం’ అని పార్ధివ్ పటేల్ అన్నాడు. ఇక తమీమ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఫ్యాబ్ 4లో ఒకడైన విరాట్ టెస్టుల్లో విఫలమైనా.. వన్డేల్లో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడని బంగ్లా మాజీ కెప్టెన్ గుర్తు చేశాడు.
‘టెస్టు క్రికెట్లో ఫ్యాబ్ 4 ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే.. ఈ ఫార్మాట్లో ఒక బ్యాటర్ ఒంటరిగా జట్టును గెలిపించలేడు. కానీ, వన్డేల్లో మాత్రం ఆ చాన్స్ ఉంటుంది. కోహ్లీ అలా ఎన్నోసార్లు ఒంటరి పోరాటంతో టీమిండియాను విజయ పథంలో నడిపాడు. రూట్, స్మిత్, విలియమ్సన్లో వన్డేల్లో తమ జట్లకు అన్ని విజయాలు అందిచలేదని నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. మరో విషయం.. కోహ్లీపై ఉన్నంత ఒత్తిడి ఈ ముగ్గరిపై లేదు’ అని తమీమ్ వెల్లడించాడు.
Virat Kohli has 7 Double tons in test cricket in his career but Best,
1. 153 Centurion
2. 123 perth
3. 141 Adelaide
4. 149 edgbastonpic.twitter.com/5R1IFCm3qS— ً (@Worshipkohli) August 5, 2023
చెపాక్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో విఫలమైన కోహ్లీ కాన్పూర్‌లో భారీ స్కోర్ కొట్టాలనే కసితో ఉన్నాడు. టెస్టుల్లో 29వ సెంచరీ దగ్గరే ఆగిపోయిన రన్ మెషీన్ మరోసారి తన పరుగుల దాహర్తితో రికార్డులు బద్ధలు కొట్టాలని క్రికెట్ అభిమానుల అభిలాష.