HYDRAA | హైదరాబాద్ : కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా హడల్‌కి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్పల్లి యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లకు కట్నంగా మూడు ఇండ్లు రాసిచ్చింది.
అయితే హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఇండ్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు ఇటీవలే హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బుచ్చమ్మ శుక్రవారం ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి కుమార్తెలు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
హైడ్రా అధికారుల వేధింపుల కారణంగానే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుమారులు లేనప్పటికీ.. తన ముగ్గురు కుమార్తెలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో రూపాయి రూపాయి కూడబెట్టి ఈ ఇల్లును కొనుక్కున్నది. బిడ్డల పెళ్లిళ్లకు కట్నం కింద రాసిచ్చింది. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తాం అనేసరికి ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు తెలిపారు.
ఇది ముమ్మాటికీ హైడ్రా హత్యే!
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా హడల్ కి మహిళ ఆత్మహత్య
కూకట్ పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య
గుర్రంపల్లి శివయ్య బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు
ముగ్గురు బిడ్డలకు పెళ్లిళ్లకు కట్నంగా ముగ్గురికి… pic.twitter.com/j1MUEPrB0D
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2024
ఇవి కూడా చదవండి..
Musi River | మూసీ బఫర్ జోన్లో పట్టాలున్న కుటుంబాలకు పునరావాసం, పరిహారం : దాన కిశోర్
Musi River | మూసీ నిర్వాసితుల తరలింపునకు ప్రత్యేక సిబ్బంది.. జీహెచ్ఎంసీ ఉత్తర్వులు
HYDRAA | హైడ్రాపై హైకోర్టు సీరియస్.. విచారణకు హాజరు కావాలని రంగనాథ్‌కు ఆదేశం