Musi River | హైదరాబాద్ : త్వరలో మూసీ నది బఫర్ జోన్లో నిర్మాణాలను సర్వే చేయనున్నట్లు మూసీ రివట్ ఫ్రంట్ ఎండీ దాన కిశోర్ ప్రకటించారు. బఫర్ జోన్లో చేపట్టిన నిర్మాణాలకు మార్కింగ్ ప్రక్రియ చేపడుతామన్నారు. బఫర్ జోన్లో పట్టాలున్న కుటుంబాలకు పునరావాసం, పరిహారం ఇస్తామన్నారు. నదీ గర్భంలో కొందరికి పట్టాలు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పట్టాలున్న వారు సంబంధిత జిల్లా కలెక్టర్లను కలవాలి. పట్టాలు పరిశీలించి అర్హులకు పరిహారం అందిస్తామని దాన కిశోర్ స్పష్టం చేశారు.
మూసీ నిర్వాసిత కుటుంబాల్లోని పిల్లలపై రేపట్నుంచి 2 రోజుల పాటు సర్వే నిర్వహించనున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సమీపంలోని స్కూళ్లల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీ చిన్నారుల నుంచి కాలేజీ విద్యార్థుల వరకు వివరాలను సేకరించనున్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి..
Musi River | మూసీ నిర్వాసితుల తరలింపునకు ప్రత్యేక సిబ్బంది.. జీహెచ్ఎంసీ ఉత్తర్వులు
HYDRAA | హైడ్రాపై హైకోర్టు సీరియస్.. విచారణకు హాజరు కావాలని రంగనాథ్‌కు ఆదేశం