Krishna Nagar : పారాలింపిక్స్‌లో పతక వేటకు సిద్ధమైన బ్యాడ్మింటన్ స్టార్ కృష్ణా నగర్ (Krishna Nagar)కు ఊహించని పరిస్థితి ఎదురైంది. విశ్వ క్రీడల కోసం అతడితో వెళ్లాల్సిన కోచ్ వీసాను పారిస్ అధికారులు పక్కన పెట్టేశారు. దాంతో, కృష్ణా సాయం కోసం ప్రభుతాన్ని ఆశ్రయించాడు. ‘ప్లీజ్ నాకు సాయం చేయండి’ అంటూ అతడు ఎక్స్ వేదికగా అభ్యర్థించాడు.
‘నా వ్యక్తిగత కోచ్ వీసాను పారిస్ ఒలింపిక్ నిర్వాహకులు తిరస్కరించారు. నా విజయంలో అతడి పాత్ర ఎంతో ఉంది. అందుని ఫ్రాన్స్ దౌత్య కార్యాలయాన్ని మరోసారి అతడి వీసా దరఖాస్తును పరిశీలించాల్సిందిగా మనవి చేస్తున్నా. మీ విలువైన సలహాలు, సూచనలకు అభినందనలు’ అని కృష్ణ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
🚨 Urgent: My personal coach’s visa for the Paris 2024 Paralympic Games was rejected. Their role is crucial for my success. I’ve requested a reconsideration from the French embassy. Any support or advice is appreciated! 🙏🇫🇷 @thierry_mathou @FranceinIndia #Paris2024 #Paralympics… pic.twitter.com/F47jxDkB7B
— Krishna Nagar (@Krishnanagar99) August 16, 2024
టోక్యో పారాలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో కృష్ణ అదరగొట్టాడు. ఎస్‌హెచ్ 6 విభాగంలో పసిడి పతకంతో రికార్డు నెలకొల్పాడు. ఈసారి కూడా అతడు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. కృష్ణతో పాటు 13 మంది షట్లర్లు పారిస్ ఆతిథ్యమిస్తున్న పారాలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆగస్టు 28 బుధవారం నుంచి పారిలింపిక్స్ షురూ కానున్నాయి. సెప్టెంబర్ 8వ తేదీతో ఈ పోటీలు ముగుస్తాయి. ఈసారి కనీసం 25 పతకాలు గెలుస్తామని పారాలింపిక్స్ ఇండియా చీఫ్ దేవేంద్ర ఝఝారియా చెప్పిన విషయం తెలిసిందే.