ఓ తల్లి కన్నపేగును వదిలించుకున్నది. అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసి వెళ్లింది. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటిలో చోటు చేసుకుంది.
పడమటిలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి పాప ఏడుపులతో చిన్నారిని స్థానికులు గమనించారు. పాపను ఎవరి వదిలి వెళ్లారు? ఎందుకు వదిలి వెళ్లారనే వివరాలు తెలియాల్సి ఉంది.