IND vs ENG : ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. నాలుగో రోజు తొలి సెషన్లో రెండు వికెట్లు పడినా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (41 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించాడు. ప్రత్యర్థికి బజ్ బాల్ తరహా ఆటను చూపిస్తూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(24 నాటౌట్) సైతం విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. పంత్, గిల్ జోడీ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో భారత ఆధిక్యాన్ని 350కి పెంచింది. లంచ్ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భారత బ్యాటర్లు దంచేస్తున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అర్ద శతకంతో మెరవగా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ తనవైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను కంగారెత్తించాడు. ఓవర్ నైట్ స్కోర్ 64-1తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు బ్రాండన్ కార్సే, క్రిస్ వోక్స్‌లు సవాల్ విసిరారు. ఈ ఇద్దరూ బంతిని స్వింగ్ చేస్తూ వికెట్ కోసం ప్రయత్నించినా వాళ్ల వ్యూహాల్ని దెబ్బకొట్టాడు రాహుల్. అయితే.. క్రీజులో కుదురుకున్న కరుణ్ నాయర్(26)ను ఔట్ చేసిన కార్సే ఇంగ్లండ్‌కు తొలి బ్రేకిచ్చాడు.
That’s Lunch on Day 4 at Edgbaston! #TeamIndia added 113 runs to their overnight score to move to 177/3 & lead England by 357 runs. 💪
Stay tuned for the second session ⌛️
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND pic.twitter.com/rGJcu8ERLk
— BCCI (@BCCI) July 5, 2025
అయినా ఒత్తిడికి లోనవ్వకుండా ఆడిన రాహుల్ అర్ధ శతకం తర్వాత టంగ్ ఓవర్లో బౌల్డయ్యాడు. బిగ్ వికెట్ తీసిన ఆనందంలో ఉన్న ఇంగ్లండ్‌కు పంత్ వణుకు పుట్టించాడు. వస్తూ వస్తూనే టంగ్ ఓవర్లో లెగ్ సైడ్ ఫోర్, లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాది తన ఉద్దేశాన్ని చాటాడీ చిచ్చరపిడుగు. అంతే.. టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పిన పంత్.. ఆధిక్యాన్ని 350 పెంచాడు. లంచ్ తర్వాత ఈ ద్వయం ఇదే తరహాలో ఆడితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు. ప్రత్యర్థికి కనీసం 450 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశించితే గానీ మ్యాచ్‌పై ఆశలు పెట్టుకోలేం. ఎందుకంటే లీడ్స్‌లో 371 పరుగులను ఆతిథ్య జట్టు ఊదిపడేసిన విషయం తెలిసిందే.