Canada Open : భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ (Kidambi Sreekanth) కెనడా ఓపెన్ సూపర్ 300లో రఫ్ఫాడిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో అద్భుత విజయాలతో ఫేవరెట్‌గా మారిన అతడు టాప్ సీడ్‌కు షాకిచ్చి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ చౌ థియెన్ చెన్(చైనీస్ తైపీ)ని వరుససెట్లలో మట్టికరిపించిన శ్రీకాంత్ టైటిల్‌కు మరింత చేరువయ్యాడు.
కెనడా ఓపెన్‌లో భారత షట్లర్లు నిరాశపరచగా శ్రీకాంత్ మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. వరుసగా ప్రత్యర్థులకు చెక్ పెడుతూ క్వార్టర్స్ చేరుకున్న అతడు.. ఆరో సీడ్ చౌ థియెన్కు చెమటలు పట్టించాడు. మాజీ ఛాంపియన్ అయిన శ్రీకాంత్ బలమైన షాట్లతో విరుచుకుపడుతూ తొలి సెట్‌ను 21-18తో గెలుచుకున్నాడు. రెండో సెట్లో మరింత శివాలెత్తగా చెన్ తలొంచక తప్పలేదు. 21-9తో సునాయసంగా విజయం సాధించిన శ్రీకాంత్ సెమీస్‌లో అడుగుపెట్టాడు.
Srikanth Kidambi takes down the top seed Chou Tien Chen with a dominant 21-18, 21-9 win! 💥
Advances to a semifinal clash awaits against 3rd seed Kenta Nishimoto. The comeback is getting real🔥 pic.twitter.com/ZZOUk8lqyH
— BAI Media (@BAI_Media) July 5, 2025
ఫైనల్ బెర్తు కోసం మూడో సీడ్ కెంటా నిశిమొటో(Kenta Nishimoto)ను ఢీకొననున్నాడు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్. గత రికార్డులు చేస్తే నిశిమొటోపై శ్రీకాంత్ 6-4తో పైచేయి సాధించాడు.అంతకంటే ముందు జరిగిన మ్యాచ్‌లో భారత షట్లర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ పోరాడి ఓడిపోయాడు.